Powered By Blogger

Pages

Saturday 4 January 2014

దేహంలోని జీవం బదులు,
కోవెలలోని దైవం బదులు... అన్ని నీ మయమే.
ఊపిరిలోని గాలికి బదులు,
హృదయంలోని లయలకి బదులు అంతా నీ ప్రేమే.. @ మేఘ  
గాలిని వలలో బందిస్తావా...?
ప్రేమని మదిలో మూసెస్తావా....?
అయ్యెపనియెనా...? @ మేఘ. 
ప్రేమ ఒక పిచ్చిది...
ప్రాణం ఇచ్చేంత మంచిది..@ మేఘ.  

Friday 3 January 2014

ఎంత వెనక్కి లాగినా....నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది....నా తప్పు ఏంటనీ..?  
నా మనసు - నాతో మాట్లడటానికి కూడా....
నిన్ను అడిగి చెప్తానంటే....???!!! మేఘ    
"I LOVE YOU"
ఇది చెప్పటానికి ఒకమాటే,
చెపాటానికైన..../వినటానికైనా...బాగుంటుంది ఆ తరువాతే మొదలవుతుంది అసలు అయోమయం అంతా,
అటు ప్రశ్న ?  కాకుండా...
ఇటు బదులు !! కాకుండా....
ఎప్పుడూ బదులు వెతికే ప్రశ్నలా....మిగిలిపోతుంది.@మేఘ.
అందరూ నా చితిని పేరుస్తుంటే
నువ్వు మాత్రం గాలికి కదలాడే ఆకుల్ని చూస్తూ
ఆకాశంలో ఎగిరే విహంగాలను చూస్తూ
మౌనంగా పరధ్యానంలో ఉంటావు.

నేను చితి మీద లేనని నీ ఓక్కడికే తెలుసు.
అందుకే నీ హృదయంలో ఎప్పటికీ నేనుంటాను.
నువ్వు చూసే ప్రతీ ఒక్కదానిలో నేనే నిక్షిప్తమై ఉంటాను.

నేస్తం...
నా గుండెలో గూడు కట్టుకున్న భావాలెన్నో నీకు చెబుదామని
నన్నుక్కిరిబిక్కిరి చేసిన క్షణాల్ని నీతో పంచుకోవాలనీ
ఎన్నో సార్లు ప్రయత్నించినా నా పెదవి దాటలేకపోయాయి.
ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే,

నీ భావాలతో ఆడుకుని ఉంటే క్షమించు.
నీకో అందమైన అనుభూతిని అందించి,
నీలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఆశే తప్ప,
నాకు ఏ స్వార్థం లేదు.

అయినా ఏం?
నేనేం చెప్పకున్న నీకన్నీ తెలుస్తాయి.
నువ్వు అన్నీ తెలుసుకుంటావు.
నా గురించి ఏమీ చెప్పకుండా,
అలిగినా, తిట్టినా, కొప్పడ్డా,
నువ్వంటే ఇష్టం అన్నా, నీతోనే ఉంటాను అన్నా అవన్నీ నిజం.
నేను ఎవరైనా ఎప్పటికీ నీతోనే ఉంటాను.
నీ గుండెల్లోనే నా ఆలోచనలు తిరగాడుతాయి.

ఇన్ని రోజుల మన ప్రయాణంలో
ఇవాళ నేను అలుసుగా అనిపిస్తున్నాను కదూ...
నీ కంటికి ఒక పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదూ..
నువ్వూ ఏమనుకున్నా సరే,
నువ్వంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పటికీ నేనెవరో ఎలా చెప్పను? అన్నీ నువ్వే తెలుసుకున్నావ్...

నీ ముందు నా ఈ రూపం మారినా,
నీ ఎదలో నా స్థానాన్ని మారనీయవుగా....
మిత్రమా! సెలవు మరి.....
"నమ్మకం"
ఇది చాలా "HARD"గురూ,
కొందరి జీవితాలకి మూలం అవుతుంది,
మరి కొందరి జీవితాలను అందకారంలోకి నెట్టేస్తుంది...@మేఘన.

Thursday 2 January 2014

నలుగురిని నవ్వించడానికి "జోకర్"లా "నవ్వు"అనే ముసుగు వేసుకోగలను....
కానీ,
నలుగురిని నమ్మించడానికి మాత్రము "సీతకోకచిలుక"లా రంగులు మార్చలేను..
నేనింతే....నా స్వభావము....ఇంతే...
నమ్మించి-నటించటం నాకు రాదు,మాట తప్పయితే మన్నించమని కోరటం తప్ప...@ మేఘన.    
మనసు నాదే, మాటలు నావే....
నా మనసు ఎపుడు అనుకూలమే నీకు-ప్రతికూలమే నాకు..
నా మాటలు నమ్మను అంటే నేనేమి  చేయగలను..మిత్రమా...?!?!?